ఇప్పుడు చెల్లి తర్వాత అక్క..ఏం అదృష్టం రా బాబు..!

సినిమా పరిశ్రమంలో కొన్నిసంఘటనలు మాత్రం ఎవరు అనుకోకుండా అలా జరగిపోతుంటాయి. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తమ కెరీర్ ను మొదలు పెడుతున్న ఇద్దరు అక్క చెల్లెలు.. ఒకే యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన సంఘటన ఒకటి టాలీవుడ్ లో జరిగింది. టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ అయిన విజయ్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళ అబ్బాయి రాహుల్ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ‘మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు.

రాజశేఖర్ కూతుళ్ళు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా..?

ఇప్పటివరకు నాలుగు సినిమాలతో పాటు ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ప్రస్తుతం రాహుల్ ‘పంచతంత్రం’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాను ఐదుగురు కథల సమాహారంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఐదుగురిలో రాహుల్ కూడా ఒకరు.. అతనికి జంటగా టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితా రెండో కుమార్తె శివాత్మిక నటించింది.

Ye Ragamo - Lyrical | Panchathantram | Rahul Vijay,Shivathmika Rajashekar|#TicketFactory #SOriginals - YouTube

మూడు సంవత్సరాల క్రితం వచ్చిన దొరసాని సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది.
ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈమె నటించిన సినిమా పంచతంత్రం. ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ విజయ్ శివాత్మిక తోనే కాకుండా ఆమె అక్క శివానీ రాజశేఖర్ తోనూ మరో సినిమాలో జంటగా నటించాడు.

వినాయక చవితి సందర్భంగా విద్య వాసుల అహం మూవీ ఫస్ట్ లుక్ , టైటిల్ విడుదల

ఆ సినిమా పేరు ‘విద్య వాసులు అహం’.. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు విజయ్ అక్క చెల్లెలు తో రొమాన్స్ చేస్తూ కొద్ది గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ పై ఏం అదృష్టం రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest