ఎర్ర చీర‌లో న‌డుము మ‌డ‌త‌లు చూపిస్తూ బుట్ట‌బొమ్మ చెమ‌ట‌లు ప‌ట్టించేసిందిగా!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మడు టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుకి జోడిగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

అలాగే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కబోయే `జనగణమన` కు పూజా హెగ్డే సైన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కే అవ‌కావాలు లేవు.

ఇక‌ బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ లు టేకప్ చేసింది. అందులో `సర్కస్` ఒకటి. రణవీర్ సింగ్, పూజా హెగ్డే ఇందులో జంటగా నటిస్తున్నారు.

 

అయితే ముంబైలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పూజ హెగ్డే ఎరుపు చీరలో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది.

ఈ ఈవెంట్ లో నడుము మడతలు చూపిస్తూ బుట్ట బొమ్మ చెమటలు పట్టించేసింది. క‌ట్టుకున్నది చీర అయినా ఈ బ్యూటీ సోకులన్నీ ఒలకబోసింది.

 

ప్రస్తుతం పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. పూజ అందాల దాడికి కుర్ర‌కారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

 

Share post:

Latest