అయ్యో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు కూడా ఆ సమస్య నేనా..?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటునేలా చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో కళ్యాణ్ రామ్ కి ఎవరు సాటి రారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త దర్శకులకు టెక్నీషియన్లను అవకాశాలు ఇస్తూ సరికొత్త సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్. రీసెంట్గా బింబిసార చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ గాడిలో పడ్డారు. ఈ చిత్రంతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.

Kalyan Ram DEVIL: 'డెవిల్: ది బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్'గా వస్తున్న కళ్యాణ్  రామ్.. ఫస్ట్ లుక్ అదుర్స్.. | Nandamuri Kalyan Ram birthday special and he  becomes DEVIL The British Secret ...ఇప్పుడు కళ్యాణ్ రామ్ రెండు సినిమాలలో నటిస్తూ అందులో కొత్త దర్శకుడు రాజేందర్రెడ్డి ని పరిచయం చేస్తూ ఉన్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరొక మూవీ కళ్యాణ్ రామ్ డెవిల్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్గా బాబు బాగా బిజీ చిత్రంతో దర్శకుడుగా మారిన డైరెక్టర్ నవీన్ మేడారం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ నాయ నిర్మిస్తూ ఉన్నారు.

ఈ సినిమా 1945 కథ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమా రెగ్యులర్ మూవీ షూటింగ్ ను ప్రారంభించారు. ఇందుకోసం కళ్యాణ్ రామ్ డెవిల్ లుక్ లో మారిపోయినట్లుగా గడిచిన కొద్దిరోజుల క్రితం ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. పీరియాడిక్ డ్రామాగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ సమస్య వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముక్తా ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ముక్తా డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరొక హీరోయిన్ సంయుక్త మీనన్ ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బింబీ సార చిత్రంలో ఈమె హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ ఆ హీరోయిన్ రిపీట్ చేయడం ఇష్టం లేనట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ల విషయం తలనొప్పిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నది.