స్పీడ్ పెంచిన ఎన్టీఆర్ బామ్మర్ది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సిని వారసులు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మెగా కుటుంబం నుంచి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోల బంధువుల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా మరొక హీరో రాబోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Teja To Launch NTR's Brother-In-Law Narne Nithin - Featuredనార్నే నితిన్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. శ్రీ శ్రీ శ్రీ రాజావారు. ఈ చిత్రాన్ని సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు . ఈ సినిమా షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతోంది.ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్లు పోస్టర్తో పాటు టైటిల్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని డైరెక్టర్ సతీష్ విజ్ఞేశ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగులు దాదాపు 80% శాతం పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Narne Nithin's first look from Sri Sri Rajavaru - TeluguBulletin.comత్వరలోనే మిగతా భాగాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి నెలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ హీరోగా పరిచయం అవుతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా కాస్త సపోర్ట్ ఇస్తున్నారు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30 సినిమా షూటింగుని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోలాటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

Share post:

Latest