2022లో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైన కొత్త హీరోయిన్లు.. లిస్ట్ పెద్ద‌గానే ఉందిగా!

సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగు పెడుతూనే ఉంటారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ కు కొంతమంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. మ‌రి వారెవరు.. ఏ సినిమా ద్వారా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సంయుక్త మీనన్.. ఈ ఏడాది టాలీవుడ్ కు ప‌రిచ‌మ‌మైన కొత్త హీరోయిన్ల జాబితాలో ఈమె ఒక‌రు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కిన `భీమ్మా నాయ‌క్‌` మూవీతో సంయుక్తి మీనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

2. మానస రాధాకృష్ణన్.. విజ‌య్ దేవ‌ర‌కొండ తమ్మ‌డు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన `హైవే`తో మాన‌స రాధాకృష్ణన్ ఈ ఏడాది తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రియ‌డం అయింది.

3. మిథిలా పాల్కర్.. విశ్వ‌క్ సేన్ హీరోగా రీసెంట్ గా విడుద‌లైన `ఓరి దేవుడా` మూవీతో మిథిలా పాల్కర్ తొలి సారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.

4. రజీషా విజయన్.. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `రామారావు ఆన్ డ్యూటీ`తో రజీషా విజయన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

5. రచితా రామ్.. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన `సూపర్ మచ్చి` తో రచితా రామ్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది.

6. షిర్లే సెటియా.. నాగ శౌర్య పక్కన `కృష్ణ వ్రింద విహారి` లో కనిపించింది షిర్లే సెటియా. ఈమెకు టాలీవుడ్ లో ఇదే డ‌బ్యూ మూవీ.

7. మృణాల్ ఠాకూర్.. బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `సీతారామం` తో మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది.

8. బాంధవి శ్రీధర్.. రీసెంట్ హిట్ `మసూద` మూవీతో బాంధవి శ్రీధర్ టాలీవుడ్ లోకి వ‌చ్చింది.

9. నజ్రియా నజీమ్.. నాని హీరోగా తెర‌కెక్కిన `అంటే సుందరానికీ`లో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఇదే ఈమె తొలి చిత్రం.

10. రితిక నాయక్.. `అశోక వనంలో అర్జున కళ్యాణం` మూవీతో రితిక నాయక్ అనే మ‌రో బ్యూటీ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది.

Share post:

Latest