నాగచైతన్యని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారా.. వారికి అదే భయమా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా అయిన జోష్ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. దాని తరువాత చాలా సినిమాలలోనే నటించాడు కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్‌డమ్‌ని మాత్రం నాగ చైతన్య సంపాదించుకోలేకపోయాడు. ఇటీవలే రిలీజ్‌ అయిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సంధించి. అయిన నాగ చైతన్యకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ హిట్ ని సాయి పల్లవి తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత వచ్చిన బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇటీవలే చైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు ఆయనకి పెద్ద డిజాస్టర్లు అయ్యాయి.

ఇక రీసెంట్‌గా నాగచైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చిన ‘దూత’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన విషయం మనందరి తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం మాత్రం రిలీజ్ చేయడం లేదు. నాగచైతన్య వెబ్‌సిరీస్‌ను కావాలనే అమెజాన్ ప్రైమ్ వారు రిలీజ్ చేయడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం దూత వెబ్‌సిరీస్‌ చూసిన ఔట్‌పుట్ అసలు బాగోలేదని, దీనిని మళ్లీ రీషూట్ చేయాలని చెప్పడమేనట. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో కొన్ని ఎడిటింగ్స్‌ కూడా చేయాల్సి ఉందట. అందుకే వెబ్‌సిరీస్‌ కాస్త లేట్‌గా రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే రీషూట్ విషయం మాత్రం నిజం కాదట.

నాగచైతన్య నటించిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి, అంతేకాకుండా ఇండస్ట్రీలో విక్రమ్.కే కుమార్ పేరు కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి దూత వెబ్‌సిరీస్‌ని ఇప్పుడు రిలీజ్ చేస్తే అసలు ఎవరు చూడరనే భయంతో అమెజాన్ యాజమాన్యం ఈ సినిమాని రిలీజ్‌ చేసే విషయంలో ఆలస్యం చేస్తున్నారట. ఇక నాగచైతన్య సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాకనే దూత వెబ్‌సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తారట.

Share post:

Latest