ఆ ప‌ని చేస్తే ఆఫ‌ర్లు త‌గ్గుతాయ‌న్న‌ది అపోహ.. మృణాల్ షాకింగ్ కామెంట్స్‌!

ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరలేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ లో `పిప్పా` ఒకటి. యుద్ధ నేపథ్యంలో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటిస్తున్నాడు.

అతడి సోదరిగా మృణాల్ ఠాగూర్ కనిపించబోతోంది. అయితే ఒక్కసారి హీరోలకు చెల్లెలు పాత్రల్లో నటిస్తే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే హీరోయిన్లు అలాంటి పని చేయరని అంటుంటారు. కానీ ఇలాంటి పాతకాలపు సెంటిమెంట్లు తాను పట్టించుకోనని మృణాల్ షాకింగ్ కామెంట్ చేసింది.

`చెల్లెలు, భార్య పాత్రల్లో హీరోయిన్లు నటిస్తే ఆఫ‌ర్లు త‌గ్గుతాయ‌న్న‌ది అపోహ మాత్రమే. రూల్స్‌ బ్రేక్‌ చేసినప్పుడే మనమెంటో నిరూపించుకోవచ్చు. ఏ పాత్రలోనైనా ప్రేక్షకుల్ని మెప్పించడమే నిజమైన ప్రతిభగా భావించాలి. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే ఓ గొప్ప పాత్రను మిస్‌ అయ్యానని బాధపడ‌కూడ‌దు. పిప్పా చిత్రంలో చెల్లెలి పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్ట్ అవుతుంది` అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.