అబ్బయ్యకు గడ్డు పరిస్తితి..రిస్క్‌లోనే..!

దెందులూరు లాంటి టీడీపీ కంచుకోటలో చింతమనేని ప్రభాకర్ లాంటి ఫైర్ బ్రాండ్ నాయకుడుని ఓడించిన అబ్బయ్య చౌదరి ఇప్పుడు..దెందులూరులో గడ్డు పరిస్తితులు ఎదురుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అబ్బయ్యకు అన్నీ అనుకూల పరిస్తితులు ఉన్నాయి..కానీ ఇప్పుడు ఆ పరిస్తితులు కనిపించడం లేదు. పార్టీ పరంగానే కాదు స్వతహాగా నెగిటివ్ పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుని బాగా కఠినతరం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన అబ్బయ్య..2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దెందులూరులో పోటీ చేశారు. చింతమనేనిపై నెగిటివ్ రావడం, వైసీపీ వేవ్ ఉండటంతో అబ్బయ్య మంచి మెజారిటీ తో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వారి మద్ధతు ఇంకా పెంచుకోవాలి. కానీ అబ్బయ్య ఆ దిశగా పనిచేసినట్లు లేరు. ఏదో ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి గాని..సెపరేట్ గా అబ్బయ్య..నియోజకవర్గంలో చేసే అభివృద్ధి తక్కువ. పైగా ప్రత్యర్ధి వర్గమైన చితమనేనిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని తెలిసింది. దెందులూరులో టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు  పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అంశం అబ్బయకు నెగిటివ్ అవుతుంది..ఇక తాజాగా చింతమనేని అనుచరుడుపై అబ్బయ్య అనుచరులు దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అబ్బయ్య టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇక అబ్బయ్య లండన్ వెళ్లడానికి లాగేజ్ సర్దుకోవచ్చు అని లోకేష్ ఫైర్ అయ్యారు. ఇలా అబ్బయ్యకు కాస్త దెందులూరులో నెగిటివ్ వాతావరణం కనిపిస్తోంది.

పైగా తాజాగా చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తే టీడీపీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక బాబు సైతం అబ్బయ్య టార్గెట్ గా దెందులూరు సైకో అని, లండన్ బాబు అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో దెందులూరులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ సారి దెందులూరులో గెలవడానికి అబ్బయ్య రిస్క్ పడాలి.