మహేష్ అభిమానుల నెత్తిన పిడుగు లాంటి వార్త..అదే నిజమైతే చచ్చారు.. పో..?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB 28 అనే వర్కింగ్ టైటిల్స్ తో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ముగించుకుని రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతున్న సమయంలో మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమా షూటింగ్‌కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ అందుకోవాలని త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ని చాలా బలంగా రాసుకున్నారట.

థ‌మన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యేలోపే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ ని ముంబైలో మొదలుపెట్టారు. ఇక అక్కడ త్రివిక్రమ్ థ‌మన్ లు ముంబైలో మహేష్ ని కలిసి ఈ సినిమా సాంగ్స్ గురించి స్టోరీ గురించి డిస్కషన్ చేశారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ త్రివిక్రమ్ థ‌మన్ డిన్నర్ చేస్తున్న ఫోటోని నమ్ర‌త సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఆ ఫోటోలు చూడగానే ఆనందించాల్సిన అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఆ ఫోటోలో ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ తో పాటు మరో దర్శకుడు మెహర్ రమేష్ కూడా మహేష్ ను ఎందుకు కలిశాడు అంటూ మహేష్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంపతీసి మహేష్ మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ భయపడుతూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Maher Ramesh grabs Mahesh Babu Sarileru Nikkevaru

మెహర్ రమేష్ తో మహేష్ సినిమా అనే టాపిక్ ఇప్పుడైతే లైన్‌లో ఏమీ లేదు. అయితే మెహార్‌ రమేష్ మాత్రం మహేష్ కు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన దగ్గరే ఉంటున్నాడు. ఇక మొన్న కృష్ణ చనిపోయిన సమయంలో కూడా మెహర్ రమేష్ మహేష్ తోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ స్నేహం కారణంగానే ఈ మీటింగ్‌కి మెహర్‌ రమేష్ వచ్చి ఉంటారని అంటున్నారు.

Share post:

Latest