కొడుకు గౌతమ్‌ టాలెంట్ కి విస్తుపోతున్న నమ్రత… మహేష్ బాబుకి తీసిపోడంటూ కితాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ బాండింగ్ గురించి అందరికీ తెలిసినదే. బేసిగ్గా భారతీయ సినిమా పరిశ్రమలోనే ఫామిలీ విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి రూమర్స్ లేని కుటుంబం ఒకటి ఉందంటే అది మహేష్ బాబు ఫామిలీ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. గత కొన్నేళ్లుగా మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నమ్రత – మహేష్ బాబు.. తమ ఇద్దరు పిల్లలపై సందర్భానుసారంగా ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. వారి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార గురించి అందరికీ తెలిసిందే.

అయితే సితార టాలెంట్ గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈపాటికే రకరకాల స్టేజ్ షోస్ ఇచ్చి వుంది. అయితే చాలామందికి తెలియనిది ఏమంటే మహేష్ కొడుకు గౌతమ్‌కి కూడా మంచి టాలెంట్ ఉందనే విషయం. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది… గౌతమ్ తండ్రికి తగ్గ తనయుడిని. ఇక కొడుకుని చూసి తల్లి నమ్రత కూడా అలాగే ఫీల్ అవుతోంది మరి.

దానికి సంబంధించిన ఓ వీడియోని నమ్రత పోస్ట్ చేస్తూ ‘నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని కామెంట్ చేసింది. ఇంకేముంది కట్ చేస్తే ఆ వీడియో కాస్త వైరల్ అయింది. విషయం ఏమంటే, తన స్కూల్లో ఓ నాటకంలో పాత్రను పోషించాడు గౌతమ్. స్నేహితులతో కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ తన నటనా ప్రతిభను కనబరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ గౌతమ్ టాలెంట్ పై ప్రశంసలు గుప్పించింది నమ్రత. ఈ వీడియోలో గౌతమ్ గెటప్ కొత్తగా వుంది. గౌతమ్‌ని అలా చూసిన నెటిజన్లు అచ్చం మహేష్‌ బాబులా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest