మాస్ డాన్స్ తో అదరగొడుతున్న ఇంద్రజ వీడియో వైరల్..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కూడా ఎప్పటిలాగానే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటోంది. ఇందులో ఎంతోమంది సెలబ్రిటీస్ సైతం తమ డాన్స్ పర్ఫామెన్స్ తో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతొంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో భాగంగా ఈసారీ ముఖచిత్రం సినిమా బృందం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

Indraja : డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన ఇంద్ర‌జ‌.. వైర‌ల్ వీడియో..! - Telugu  News 365

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖచిత్రం హీరోయిన్ తో హైపర్ ఆది పులిహోర కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె తనని అన్నయ్య అని పిలిచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇందులో జడ్జిగా ఉన్న ఇంద్రజ తన మాస్ డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇంద్రజ మొదట్లో ప్రియమైన నీకు సినిమాలోని మనసున ఉన్నది అనే పాటతో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత గజినీ చిత్రంలోని పాటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

indraja - Twitter Search / Twitter

ఇంద్రజ పర్ఫామెన్స్ ను చూసి ఓ రేంజ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఇంద్రజ కూడా కొన్ని చిత్రాలలో అమ్మ, అక్క పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Share post:

Latest