రాజమౌళి ఇంటిపేరు వెనుక ఇంత కథ ఉందా..!!

దేశం.. కాదు కాదు ప్రపంచమే మెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగు దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి మరింత పాపులారిటీని దక్కించుకుని.. ఇటీవల ఇంగ్లీష్ మ్యాగజైన్ లోకి కూడా ఎక్కాడు. ఇదిలా ఉండగా రాజమౌళి ఇంటి పేరు వెనుక ఉన్న విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. నిజానికి రాజమౌళికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవ్వడానికి కారణం ఆయనకున్న పాపులారిటీనే..

దర్శకుడు రాజమౌళి పూర్తి పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇటీవల ఈయన చెల్లెలు అలాగే ప్రముఖ లేడీ మ్యూజిక్ డైరెక్టర్గా అరుదైన రికార్డ్ సృష్టించిన ఎం ఎం శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి పూర్తి పేరు.. ఆయన ఇంటి పేరు వెనుక ఉన్న అన్ని విషయాలను ఆమె చెప్పుకు వచ్చింది. రాజమౌళి తన ఇంటి పేరును ఎందుకు పెట్టుకోలేదో.. తనకు కూడా తెలియదని శ్రీలేఖ తెలిపింది. నిజానికి రాజమౌళి పూర్తి పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి.. ఆయన ఇంటిపేరు కోడూరి అని తెలిపింది ఎం ఎం శ్రీలేఖ. తన పూర్తి పేరును రాజమౌళి షార్ట్కట్టుగా ఎస్ఎస్ రాజమౌళి అని పెట్టుకున్నారు.. అందుకే బహుశా ఇంటి పేరును పెట్టుకోలేదేమో అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇక పోసాని కృష్ణమురళి గురించి కూడా మాట్లాడుతూ.. ఆయనకు చాలా కోపం ఎక్కువ.. ఆయన సినిమాలలో చాలావరకు పని చేశాను అంటూ తెలిపింది.. నిజానికి పోసానికి టెన్షన్ చాలా ఎక్కువ.. ఒకవేళ వర్క్ విషయంలో ఆలస్యం అయితే ఆయనకు నచ్చదు. ఆడిషన్స్ టేస్ట్ గురించి పోసానికి మంచి అవగాహన కూడా ఉంటుంది అని ఆమె తెలిపింది. టెన్షన్ పడుతూ అరుస్తారే కానీ ఆయన మనసు బంగారం అంటూ మరికొన్ని విషయాలను షేర్ చేసింది శ్రీలేఖ. తనకు ఒకవేళ సినిమాలలో అవకాశాలు వస్తే మ్యూజిక్ కి సంబంధించిన పాత్రలు చేయాలని ఉందని కూడా తెలిపింది.

Share post:

Latest