ఏళ్ళు గడిచినా వేదిక అందం మాత్రం త‌గ్గ‌ట్లేదు.. ఇంత‌కీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

వేదిక.. ఈ అమ్మ‌డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మహారాష్ట్రలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ 2006లో `మద్రాసి` అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ముని, విజయదశమి, బాణం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల సోయగం.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, భాషల్లో వరసగా సినిమాలు చేసింది.

కానీ, ఎక్కడ ఈ అమ్మడుకు స్టార్ హోదా తక్క‌లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వస్తోంది. ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. అయినా సరే వేదిక అందం ఏమాత్రం తగ్గట్లేదు. మూడు పదుల వయసులోనూ అందాలను ఆరబోస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తెలుగులో ఈ అమ్మడు చివ‌రిగా నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `రూలర్` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత వేదికకు తెలుగులో ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడలో `హోమ్ మినిస్టర్` అనే సినిమా చేస్తుంది. అలాగే వినోదం అనే మూవీకి సైన్ చేసింది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు మలయాళం లోనూ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Share post:

Latest