బాక్సాఫీస్ వ‌ద్ద `హిట్ 2` బీభ‌త్సం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌద‌రి జంట‌గా శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `హిట్ 2`. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ల‌భించ‌డంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా బీభ‌త్సం సృష్టిస్తోంది. ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లు కాగా.. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఈ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసింది. ఇక తాజాగా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ది రోజుల‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఏకంగా రూ. 5.39 కోట్ల రేంజ్ లాభాల‌తో సూప‌ర్ స్డ‌డీగా ముందుకు సాగుతోంది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 ప‌ది రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 6.80 కోట్లు
సీడెడ్: 1.48 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.80 కోట్లు
తూర్పు: 89 ల‌క్ష‌లు
పశ్చిమ: 59 ల‌క్ష‌లు
గుంటూరు: 92 ల‌క్ష‌లు
కృష్ణ: 84 ల‌క్ష‌లు
నెల్లూరు: 52 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 13.84 కోట్లు(23.25 కోట్లు~ గ్రాస్‌)
———————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.30 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4.25 కోట్లు
————————————
వైర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 20.39 కోట్లు(37.25 కోట్లు~ గ్రాస్‌)
————————————