‘హిట్ 2’ హీరోయిన్ ఘాటైన ఫోటో షూట్… ఆ అందాలను చూసారా?

టాలీవుడ్ ఫ్రెష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుసా? తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయనక్కర్లేదు కానీ, ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ చిత్రాలతో మీనాక్షి చౌదరి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకి సరియైన గుర్తింపు రాలేదు. అయితే ఆమె అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడంలో తనమునకలై వుంది. ఓ వైపు తన అందంతో సోషల్ మీడియాలో యువతని ఆకర్శించే పనిలో పడింది.

మీనాక్షి ఒడ్డు, పొడుగు మొత్తంగా గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొందరు ఉద్దండులు చెబుతున్నారు. అయితే ఆమెకి సరైన హిట్ పడాలి. సరిగ్గా ఇదే సమయంలో అడివి శేష్ సరసన హిట్ పార్ట్ 2లో నటించే అవకాశం కొట్టేసింది. ఇంకేముంది, ఈ సినిమాతో అమ్మడుకి హిట్ ఖాయమని కొందరు జోష్యం చెప్పేస్తున్నారు. స్వతహాగా అనేక అవార్డులు గెలుచుకున్న మోడల్ మీనాక్షికి తనదైన పంథాలో అందాల్ని ఎలా వడ్డించాలో బాగా తెలుసు. తాజాగా మీనాక్షి చౌదరి అందమైన చీరకట్టులో మెరుపుతీగలా వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

అవును, తాజాగా ఆమె సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చిందిస్తూ అరకొర చీరలో కనిపిస్తున్న ఫోజులు చూస్తుంటే అమేజింగ్ అనే చెప్పాలి. చేతులు పైకెత్తి మరీ నడుము సొగసుతో కుర్రాళ్ళ హృదయాలు దారితప్పేలా చేస్తోంది. మీనాక్షికి కనుక ఒక హిట్ పడితే ఇక ఆమెని ఆపడం ఎవరి తరమూ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హిట్ 2 రిలీజ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ శుక్రవారం హిట్ 2 చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.

Share post:

Latest