చిన్న హీరోగా పేరు సంపాదించి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించిన వారిలో జొన్నలగడ్డ సిద్దు కూడా ఒకరు.డీజే టిల్లు సినిమాతో అనుకోకుండా మంచి విజయాన్ని అందుకోవడంతో మరింత పాపులర్ అయ్యారు సిద్దు జొన్నలగడ్డ. కథ కథనాలలో లాజిక్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను సాధించింది.ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా తన ఘనత అనుకోవడం వల్ల ఇప్పుడు మరింత సమస్యగా మారుతోంది. డీజే తెలుగు సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ లో సిద్దు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఆ సినిమా బాగానే సక్సెస్ అయ్యింది.
ప్రతిసారి తన యాటిట్యూడ్ చూపించడంతో సీక్వెల్ సినిమా పైన మరింత ప్రభావం చూపిస్తోంది. ముందుగా డైరెక్టర్ విమల కృష్ణ సిద్దుతో సీక్వెల్ కుదరదని భావించి ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నారు. కొత్తగా మల్లీక్ రామ్ ను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు చర్చి అంతా దర్శకుడు గురించి కాకుండా హీరోయిన్ల గురించి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి హీరోయిన్లు ఒక అవకాశం వచ్చి తగినంత రెమ్యూనరేషన్ ఇస్తే పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు పైగా ఒక సక్సెస్ సినిమాకు సీక్వెల్ వాళ్లకు చాలా ఆశ ఉంటుందని చెప్పవచ్చు.
మొదట డీజే టిల్లు తెలుగు సినిమాలో నేహా శెట్టి బాగా ఆకట్టుకుంది.ఈ చిత్రంలో సీక్వెల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా సిద్దు వద్దనడంతో ఈ చిత్రంలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల నటించబోతోందని వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఈమె తప్పుకోవడం జరిగింది. దీంతో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. కార్తికేయ-2 తో మంచి విజయాన్ని అందుకున్న అనుపమ ఈ చిత్రంలో నటిస్తోంది అంటూ హింట్ ఇవ్వడం జరిగింది చిత్ర బృందం. కానీ నిన్నటి రోజు నుంచి ఈమెను కూడ చిత్ర బృందం తీసుకోలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా చూస్తూ ఉంటే అసలు సిద్దు ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ పలువురు నిటిజన్లు కామెర్లు చేస్తున్నారు. ఇంతమందిని వద్దని మరి డిజె టిల్లు సినిమా ఏం చేస్తారో చూడాలి.