దేవినేనికి బొమ్మసాని సినిమా..మైలవరంలో సైకిల్‌కు సెగలు.!

అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా అసంతృప్తి సెగలు, ఆధిపత్య పోరు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ జిల్లాలోని మైలవరంలో అటు వైసీపీలోనూ, ఇటు టీడీపీలో సైతం ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా మంత్రి జోగి రమేష్ వర్గం పనిచేస్తుంది. అసలే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో జోగి వర్గం మరింత ఎక్కువగా వసంతని నెగిటివ్ చేస్తుంది.

వైసీపీలో పరిస్తితి అలా ఉంటే..టీడీపీలో పరిస్తితి మరొకలా ఉంది. ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ్యతిరేకంగా టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే సీటు ఇవ్వాలనే డిమాండ్‌తో బొమ్మసాని వర్గం ముందుకెళుతుంది. ఇలా మైలవరం టీడీపీలో రచ్చ నడుస్తోంది. నందిగామ స్థానానికి చెందిన ఉమా..2009, 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు.

TDP internal Clashes Bursted out in Mylavaram Constituency - Sakshi

2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయాక ఉమా దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు. కాకపోతే నియోజకవర్గంలో కొందరు నేతలని కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బొమ్మసాని వర్గాన్ని..దీంతో బొమ్మసాని రివర్స్ అయ్యారు. 2014లో తన వల్లే ఓట్లు చీలి ఉమా గెలిచారని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు అని ఫైర్ అవుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన బొమ్మసాని ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు.

2014లో మైలవరం సీటు ఆశించారు. కానీ వైసీపీ నుంచి జోగి రమేష్ పోటీ చేశారు. దీంతో ఇండిపెండేట్ గా బొమ్మసాని బరిలో దిగి వైసీపీ ఓట్లు చీల్చి పరోక్షంగా దేవినేని గెలుపుకు సహకరించారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. కానీ దేవినేని..బొమ్మసానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని కూడా సెపరేట్ గా చేస్తున్నారు. ఇక పోరు ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో మైలవరంలో దేవినేనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది.