హిట్ -3 చిత్రంలో అనసూయ పై డిమాండ్..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తరువాత యాంకర్ గా మారి తన హవా కొనసాగిస్తోంది. అలా బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తోనే సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. అనసూయ ఇప్పటికి తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. అందుచేతనే వెండితెరపై పలు అవకాశాలను అందుకుంటోంది. అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన వాటిని కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

Anasuya hits harder : calls attention seeking b***d - Cine Chit Chatఇప్పుడు తాజాగా అనసూయ పై సిని ప్రేక్షకులు ఒక చిత్రం గురించి ఇమెను డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అడవి శేషు నటించిన హిట్ -2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా రూ.11 కోట్ల రూపాయల కలెక్షన్లతోపాటు రూ.28 కోట్ల రూపాయల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి నిర్మాతగా నాని వ్యవహరించగా.. సినిమాకి డైరెక్టర్ మాత్రం శైలేష్ కొలను ను దర్శకత్వం వహించారు. హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చి హిట్ -2 మంచి విజయాన్ని అందుకుంది.

హిట్ -2 సినిమా ఎండింగ్లో నాచురల్ స్టార్ నాని రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో హిట్-3 లో నాని హీరోగా నటించబోతున్నారని క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో సీరియల్ కిల్లర్ పాత్రలో జెంట్స్ మాత్రమే కనిపించారు. అమ్మాయిలని మర్డర్లు చేయడం చూపించడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలను ముక్కలుగా చేసి శరీర భాగాలను చూపించిన తీరు ప్రతి ఒక్కరిని ఒళ్ళు గూగల్పురిచేలా చేసింది. దీంతో ఈ సినిమా చూసిన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇప్పుడు సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. హిట్ -3 సినిమాలో అబ్బాయిలను చంపే దారుణమైన సన్నివేశాలు ఉంచి.. కచ్చితంగా అనసూయను నటింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి హిట్ -3 కోసం నాని ఇంతటి సాహసం చేస్తారా లేదా చూడాలి మరి.

Share post:

Latest