మ‌హేష్ అన్న ఆ మాట‌ల‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు.. అడివి శేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఇటీవ‌ల `మేజ‌ర్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మీనాక్షిచౌద‌రి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దాంతో మొద‌టి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం స‌క్సెస్ జ్యోష్ లో ఉన్న అడివి శేష్‌.. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సోషల్‌మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

అస‌లేమైందంటే.. `హిట్ యూనివ‌ర్స్ లోకి మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోను ఇన్వాల్వ్ చేయండి అన్న.. నెక్స్ట్‌ లెవ‌ల్ కి వెళ్లిపోద్ది. ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స్టోరీ రాసి మ‌హేష్ తో చేయండి` అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అందుకు అడివి శేష్ స్పందిస్తూ.. `ఈ రోజు ఉద‌య‌మే ఆయ‌న‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఒక సోదరుడిగా ఆయన ఎప్పుడూ నాకు తోడు ఉంటానని మాటిచ్చారు. ఆయన నా విషయంలో గర్వంగా ఉన్నానని చెప్పారు. ఆయ‌న మాట‌ల‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు. హిట్ 2 ఎప్పుడెప్పుడు ఆయ‌న‌కు చూపించాలా అని అతృత‌గా ఎదురుచూస్తున్నా` అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest