టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `హిట్ 2`. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు.
కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. టాక్ అనుకూలంగా ఉండటంతో 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు రీచ్ అయిన ఈ చిత్రం.. 4వ రోజు వసూళ్లతో లాభాల బాట పట్టింది.
అలాగే 4వ రోజు వర్కింగ్ డేలో ఈ చిత్రం రూ. 90 లక్షల షేర్ ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 5.56 కోట్లు
సీడెడ్: 1.24 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.52 కోట్లు
తూర్పు: 74 లక్షలు
పశ్చిమ: 49 లక్షలు
గుంటూరు: 74 లక్షలు
కృష్ణ: 68 లక్షలు
నెల్లూరు: 44 లక్షలు
———————————-
ఏపీ+తెలంగాణ మొత్తం= 11.41 కోట్లు(18.75 కోట్లు~ గ్రాస్)
———————————-
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 1.45 కోట్లు
ఓవర్సీస్: 3.35 కోట్లు
————————————
వైరల్డ్ వైడ్ కలెక్షన్ = 16.21 కోట్లు(28.70 కోట్లు~ గ్రాస్)
————————————
కాగా, ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అయితే మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 14.91 కోట్ల రేంజ్ లో షేర్‌ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఇక 4వ రోజు వసూళ్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి.. రూ. 1.21 కోట్ల లాభాలతో సూపర్ స్టడీగా దూసుకుపోతోంది.