సీమ పోరు..49లో 17 మైనస్..!

అంతా తమకే అనుకూలంగా ఉంది..అదిగో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అనే తేడా లేకుండా..అన్నిటిలోనూ వన్ సైడ్‌గా గెలిచేశాం. ఇంకా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేశామ్..అంతా మంచి చేశాం..ఇంకా 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్..వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లుగానే…రాష్ట్రంలో పరిస్తితులు ఉన్నాయా? వైసీపీ అంతా మంచి చేసిందని ప్రజలు భావిస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పొచ్చు.

జగన్ అనుకున్న అంత అనుకూలంగా ప్రజలు మాత్రం లేరనే చెప్పొచ్చు. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజలకు నచ్చినట్లు కనిపించడం లేదు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు వైసీపీపై నెగిటివ్ కనిపిస్తోంది. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ 88 సీట్ల కోసమే వైసీపీ గట్టిగా కష్టపడాల్సిన పరిస్తితి కనిపిస్తోంది. అసలు ఇంకా చెప్పాలంటే వైసీపీ అడ్డాగా ఉండే రాయలసీమలోనే సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో సీమలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలిచింది. 3 మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక ఆ మూడు గెలుచుకుని 52కి 52 గెలవాలని జగన్ ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ వాస్తవ పరిస్తితులు మాత్రం అన్నీ సీట్లు గెలిచేలా లేదు. సీమలోనే సీన్ మారిపోతుంది. సీమలో ఎక్కువగా రెడ్డి, బలిజ, బీసీ, ఎస్సీ, ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది.

అయితే రెడ్డి, ఎస్సీ, ముస్లి ప్రభావం ఎక్కువ ఉన్న స్థానాల్లో వైసీపీ మళ్ళీ సత్తా చాటేలా ఉంది. కానీ బీసీ, బలిజ, కమ్మ వర్గ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్లస్ కనిపిస్తోంది..పైగా జనసేనతో పొత్తు కొంతమేర ప్లస్. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీకి ఉన్న 49 సిట్టింగ్ సీట్లలో 17 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే టీడీపీ 20 సీట్లలో మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక వైసీపీ 32 సీట్లలో లీడింగ్ లో ఉంటుంది గాని..గతంతో పోలిస్తే లీడింగ్ తగ్గుతుంది.