తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు పైకి తీసుకొచ్చిన వారిలో దివంగత దర్శకరత్న దాసరి నారాయణ కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఈయన నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాలలో కూడా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు దాసరి గారు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం సినిమా ప్రస్థానం ఉనికి ఉన్నన్ని రోజులు కూడా దాసరి నారాయణ పేరు బాగానే వినిపిస్తూ ఉన్నది. దర్శకుడుగా ఎంతోమంది హీరోలను నిర్మాతలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దాసరి గారిదే అని చెప్పవచ్చు.
తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక మోహన్ బాబు తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం దాసరిగారే అంటూ ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది నటులను హీరోగా నిలబెట్టిన దాసరి గారి జీవితంలో ఒక కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందట. దాసరి నారాయణ కుమారుడు అరుణ్ కుమార్ 1995లో గ్రీకువీరుడు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. అటు తరువాత కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా హీరో ఇమేజ్ ని రాబట్టుకోలేకపోయారు అరుణ్ కుమార్.
అటు తరువాత ఇక హీరోగా సినీ ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఇక తన తనయుడు సినిమాలో సక్సెస్ కాలేకపోతున్నడనే దిగులు పడుతూ ఉండేవారట. తన కొడుకుని ఒక హీరోగా చూడాలని ఎంతో ఆశపడిన ఆ కోరిక నెరవేరలేదని ఒక ఇంటర్వ్యూలో దాసరి గారు తెలియజేసినట్లు తెలుస్తోంది.ఇక చివరికి దాసరి కోరిక తీరకుండానే 2017 మే 30వ తేదీన పలు అనారోగ్య సమస్యతో కన్నుమూయడం జరిగింది. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం దాసరి కుమారులను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.