లోకేష్ పాదయాత్ర..యంగ్ టీం రెడీ..!

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే..ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూ..తమ పార్టీ నేతలని యాక్టివ్ చేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం నిర్వహిస్తూ, నియోజకవర్గాల్లో పరిస్తితులు తెలుసుకుంటూ, మరో వైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే రోడ్ షో లతో బాబు బిజీగా ఉన్నారు.

ఇలా పార్టీని గాడిలో పెట్టడం కోసం అన్నీ రకాలుగా కష్టపడుతున్నారు. ఇక ఇదే తరుణంలో నారా లోకేష్ చేత పాదయాత్ర చేయించడానికి రెడీ అవుతున్నారు. వచ్చే జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏడాది పాటు లోకేష్ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో పాదయాత్రలు అనేవి పార్టీలకు ప్లస్ అవుతాయి. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్..ఇలాగే పాదయాత్ర చేసి తమ తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ రంగంలోకి దిగుతున్నారు.

May be an image of 12 people, people standing and indoor

చంద్రబాబుకు వయసు మీద పడటం, ఇంకా పార్టీ పరంగా అంతర్గత అంశాలని చూసుకోవాలి కాబట్టి..లోకేష్ చేత పాదయాత్రకి ప్లాన్ చేశారు. అయితే ఈ పాదయాత్రని పక్కా వ్యూహం ప్రకారం చేయనున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ..పాదయాత్ర ప్లానింగ్ చూసుకుంటున్నారు. ఇక టీడీపీలోని యువ నేతలు లోకేష్ పాదయాత్ర బాధ్యతలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా యువ నేతలు ఓ టీంగా వెళ్ళి లోకేష్‌ని కలిశారు. ఇక లోకేష్ పాదయాత్ర టీంలో రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, భూమ అఖిలప్రియ, గ్రీష్మ, టీజీ భరత్, ఆదిరెడ్డి శ్రీనివాస్, హరీష్, జ్యోతుల నవీన్, దేవినేని చందు, సుధీర్ రెడ్డి, అప్పలనాయుడులతో పాటు పలువురు యువ నేతలు ఉండనున్నారు. వీరు లోకేష్ పాదయాత్రని పర్యవేక్షించనున్నారు. మొత్తానికి పాదయాత్రతో భారీ ప్లానింగ్‌తో వస్తున్నారు.

Share post:

Latest