ఆ హీరోయిన్ తో ముద్దా..వద్దు బాబోయ్ వద్దు..భయపడిపోతున్న యంగ్ హీరో..!?

నందమూరి నటసిం హం మొదటిసారిగా హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ . మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా లో రన్ అవుతుంది . ఇప్పటికే మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో రెండో సీజన్ పై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు.

కాగా ఇప్పటికే రెండు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 ..ఈ శుక్రవారం మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది .కాగా ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ శర్వానంద్ , అడవి శేషు గెస్ట్లు గా వచ్చారు . ఈ క్రమంలోనే బాలయ్య తనదైన స్టైల్ లో ఇద్దరిని ముప్పు తిప్పలు పెట్టించి ఆట ఆడేసుకున్నారు.

కాగా ప్రోమో ఆధారంగా బాలయ్య అడవి శేషు ని” ఈ హీరోయిన్ ని జన్మలో ముద్దు పెట్టుకోను అని ..ఎవరితో ఫిక్స్ అయ్యావు” అంటూ అడవి శేషు ని అడుగుతాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” తడబడకుండా ..ఆలోచించుకోకుండా ..పూజా హెగ్డే “అంటూ చెప్పుకొచేస్తాడు . దీంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి పూజ హెగ్డే తో ఎందుకు ముద్దు వద్దనుకుంటున్నాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా సరే పూజా లాంటి హాట్ బ్యూటీ తో ముద్దు వద్దు అని అంటున్నారు అంటే ఏదో పెద్ద రీజన్ నే ఉంటుంది అంటున్నారు జనాలు . చూద్దాం అడవి శేషు ఎందుకు ముద్దు వద్దాన్నాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు ఆగాల్సిందే..!!

Share post:

Latest