`య‌శోద‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. స‌మంత క్లీన్ హిట్ కొట్టిందా? లేదా?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీసెంట్ గా `య‌శోద‌` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. హరి-హరిష్ ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.

నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద బీభ‌త్సం సృష్టించింది. తాజాగా ఫ‌స్ట్ వీక్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. తొలి వారం పూర్తి అయ్యే స‌మ‌యానికి ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.53 కోట్ల షేర్‌ను అందుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 10.88 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా య‌శోద ఫ‌స్ట్ వీక్‌ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..

నైజాం: 3.40 కోట్లు
సీడెడ్: 61 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 80 ల‌క్ష‌లు
తూర్పు: 39 ల‌క్ష‌లు
పశ్చిమ: 24 ల‌క్ష‌లు
గుంటూరు: 43 ల‌క్ష‌లు
కృష్ణ: 46 ల‌క్ష‌లు
నెల్లూరు: 20 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ = 6.53 కోట్లు(11.50 కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం: 90 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.05 కోట్లు
ఓవ‌ర్సీస్: 2.40 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్ – 10.88 కోట్లు(23.25 కోట్లు~ గ్రాస్)
———————————-

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఇంకా రూ. 1.12 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి ఫ‌స్ట్ వీక్ లో క్లీన్ హిట్ కొట్ట‌లేక‌పోయిన స‌మంత‌.. రెండో వారం టార్గెట్‌ను రీచ్ అవుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

Share post:

Latest