విజయవాడ ఎంపీగా యార్లగడ్డ?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి..అటు టీడీపీలో గాని, ఇటు వైసీపీలో గాని ట్విస్ట్‌లు వస్తున్నాయి. సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఏ సీటులో ఎవరు బరిలో దిగుతారనేది క్లారిటీ ఇవ్వడం కోసం పార్టీ అధిష్టానాలు కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో గన్నవరం సీటు విషయంలో వైసీపీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది.

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దాదాపు గన్నవరం సీటు ఫిక్స్. అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సీటు తనదే అని, వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని, అలాగే జీవితకాలం ఎమ్మెల్యేగా ఉంటానని అంటున్నారు. దీంతో గన్నవరం సీటుపై ఆశలు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు నిరాశకు గురయ్యారు. కాకపోతే ఆయనకున్న ఒకే ఒక ఆశ..విజయవాడ ఎంపీగా వంశీని పంపిస్తే..తాను గన్నవరంలో పోటీ చేయొచ్చని చూస్తున్నారు.

కానీ ఆ పరిస్తితి లేదు..గన్నవరంలో వంశీనే బరిలో ఉంటారు. దీంతో యార్లగడ్డకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి..ఈయన మొదట నుంచి పెనమలూరు సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అదే సీటు కోసం ట్రై చేశారు గాని జగన్..పెనమలూరులో పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డని పెట్టారు. ఇక ఈ సారి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సారథి ఉన్నారు..ఆయన్ని కాదని యార్లగడ్డకు సీటు ఇవ్వడం డౌటే. ఇంకా రెండో ఆప్షన్ వచ్చి..విజయవాడ ఎంపీగా యార్లగడ్డనే బరిలో దింపడం. ఎలాగో విజయవాడలో వైసీపీకి బలమైన అభ్యర్ధి లేరు. దీంతో యార్లగడ్డని బరిలో దింపే ఛాన్స్ ఉంది. దానికి యార్లగడ్డ ఒప్పుకుంటారా? లేదా? అనేది క్లారిటీ లేదు.

ఇక చివరిది మూడో ఆప్షన్..యార్లగడ్డ టీడీపీలోకి వచ్చి గన్నవరం సీటులో పోటీ చేయడం. టీడీపీ సైతం యార్లగడ్డ కోసం ట్రై చేస్తుంది. క్యాడర్ కూడా యార్లగడ్డ వస్తే వంశీకి చెక్ పెట్టవచ్చని చూస్తున్నారు. మరి చివరికి యార్లగడ్డ ఎక్కడ? ఏ పార్టీలో పోటీ చేస్తారో చూడాలి.