ఈ దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్లో సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక వీరిద్దరిలో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో తెలుగు హీరోయిన్ కి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ శివాత్మిక రాజశేఖర్ ని చూస్తుంటే.. ప్రతిభ ఉన్నప్పటికీ పాపం శివాత్మిక రాజశేఖర్ కి అవకాశాలు అంతగా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Shivani Rajashekar debut film launched

తాజాగా అకాశం అనే సినిమాలో అశోక్ సెల్వాన్ కి జోడిగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో శివాత్మిక రాజశేఖర్ పాల్గొంటూ ఈ సినిమా కోసం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించినట్లుగా తెలియజేసింది. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇక ఈ స్టార్ కిడ్ కు ఈ సినిమాతో నైనా సక్సెస్ దక్కి కమర్షియల్ బ్రేక్ ఇచ్చి వరుస ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి.

Shivathmika Rajashekar : చీరలో అందంగా అదరగొట్టిన శివాత్మిక రాజశేఖర్..  లేటెస్ట్ పిక్స్ వైరల్.. Rajasekhar's daughter Shivathmika Rajashekar looks  beautiful in her latest light pink saree top outfit pics goes viral– News18  Telugu

సక్సెస్ దక్కితే సోదరి శివాని కూడా ముందు ముందు రొమాంటిక్ సన్నివేశాలలో నటించే అవకాశం ఉంటుందని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఆకాశం సినిమాపై శివాత్మిక పెట్టుకున్న ఆశలు ఆమెను సక్సెస్ అయ్యేలా చేస్తాయేమో చూడాలి మరి. ఏదేమైనా ఒకవైపు తండ్రి కూడా పలు సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మరి తండ్రికి తగ్గ కూతుర్లు అనిపించుకుంటారేమో చూడాలి మరి.

Share post:

Latest