హిట్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ మునపటిలా మారనుందా..?

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు హీరో అడవి శేషు. తను నటించిన చిత్రాలు అన్ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. అందుచేతనే ఈ హీరోతో డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు అడవి శేషు. ఇప్పుడు తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన హీట్ సినిమా సీక్వెల్ హీట్ -2 సినిమాలో నటించారు.ఈ చిత్రానికి నాని సమర్పణలో నిర్మించడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కోలను దర్శకత్వం వహించారు.

High pre-release business for Adivi Sesh's HIT 2 | 123telugu.comహిట్ సినిమా కాస్త బాగానే ఆకట్టుకోవడంతో హీట్ -2 సినిమా పైన భారీ నమ్మకం పెట్టుకున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్త వహించారు డైరెక్టర్ శైలేశ్ కొలను. ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ తో కూడా ఒక సైకో త్రిల్లర్ సినిమా అన్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. హీట్ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసి విడుదల చేయక ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు హీట్ -2 సినిమా విషయంలో కూడా అవే తప్పులు చేస్తున్నారానే అనుమానాలు ప్రేక్షకులలో కలుగుతున్నాయి. అయితే అడవి శేషు సాధారణంగా ఫర్ఫెక్ట్ అనుకున్న కథలనే సెలెక్టివ్గా ఎంచుకుంటూ ఉంటారని చెప్పవచ్చు.

హీట్ -2 కు అడవి శేషు అతిపెద్ద ప్లస్ అని తెలుస్తోంది. ముఖ్యంగా క్షణం మూవీ నుంచి మేజర్ తో కలిపి వరుసగా ఇప్పటివరకు వరుసగా ఐదు సినిమాలు విజయాలను అందుకున్నారు. దీంతో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టే సినిమా ఇదే అంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

Share post:

Latest