షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి పూజా హెగ్డే ఇంట్లో అలాంటి ప‌ని చేస్తుందా?!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి ఇటీవల బలమైన గాయం అయిన సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని డాక్టర్ సలహా మేరకు ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఇంట్లో టైం పాస్ కోసం ఈ అమ్మడు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా పూజ హెగ్డే మెదడుకు పదును పెట్టే పనిలో పడింది. ఒకచోట ప్రశాంతంగా కూర్చుని పెద్ద పజిల్‌ను సెట్ చేసే పనిలో నిమగ్నం అయింది. ఆల్రెడీ న‌ల‌భై శాతం పజిల్ ను పూర్తి చేసిన పూజా హెగ్డే.. మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను పూజ హెగ్డే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన `సర్కస్`, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు జోడీగా `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే చిత్రాలు చేస్తోంది.

Share post:

Latest