బేబ‌మ్మ మతి చలించిందా.. అంత పిచ్చి ప‌ని ఎలా చేసింది?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన‌`తో బేబ‌మ్మ‌గా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరస ప్లాపులతో బోల్తా పడింది. ఆమె నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన `మాచర్ల నియోజకవర్గం`, `ది వారియ‌ర్‌`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

దీంతో ఇప్పుడు కృతి శెట్టి ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు జోడిగా ఓ ద్విభాషా చిత్రం చేస్తోంది. అలాగే తమిళంలో సూర్యతో `అసురుడు` అనే మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా కృతి శెట్టి వద్దకు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. ఓ యంగ్ స్టార్‌కు జోడీగా సినిమా చేయాలంటూ బాలీవుడ్ మేక‌ర్స్ సంప్రదించారట.

కానీ కృతి శెట్టి ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం కృతి శెట్టి ఫోకస్ మొత్తం సౌత్ పైనే ఉందట. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా నిల‌దొక్కుకున్న‌ తర్వాతే బాలీవుడ్‌కు వెళ్లాలని ఆమెని నిర్ణయించుకుందట. అయితే కృతి శెట్టి బాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం పై నెటిజ‌న్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ‌తి చెలించిందా.. కృతి శెట్టి అంత పిచ్చి పని ఎలా చేసింది.. భాష ఏదైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ ఆమెకు హితవు పలుకుతున్నారు.

Share post:

Latest