శిరీష్ తో డేటింగ్ విషయంపై అల్లు అరవింద్ అడగగా.. ఇలా చెప్పానన్న అను..!!

మలయాళం బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్ హీరో నానితో మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఊర్వశివో..రాక్షసివో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

Urvasivo Rakshasivo Music review songs lyrics - IndiaGlitz.com
అను ఇమ్మాన్యూయేల్ మాట్లాడుతూ తను పుట్టి పెరిగింది అంత అమెరికాలోనే నట. సినీ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని కుటుంబంతో 6 సంవత్సరాల క్రితమే హీరోయిన్గా తన కెరీర్ ని ప్రారంభించామని తెలిపింది. హీరోయిన్గా మజ్ను సినిమాతో తనకి అవకాశం వచ్చింది అని ఆ తర్వాత కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమా బాగానే ఆడిందని. కానీ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తుందని అసలు ఊహించలేదని తెలిపింది. ఈ సినిమా కూడా భారీ హీట్ అవుతుంది అనుకున్నాను కానీ రిజల్ట్ వేరే లాగా వచ్చింది.అయినా కూడా తన నటనలో ఫెయిల్ కాలేదని తెలిపింది. ఇక తర్వాత బన్నీతో నా పేరు సూర్య సినిమాలో నటించడంతో ఆ సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేశా అది కూడా నిరాశనే మిగిల్చిందని తెలిపింది. అందుచేతనే నేను ఏ సినిమాల పైన పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదని తెలియజేసింది.

Happy Birthday Allu Aravind: On filmmaker's 72nd birthday, some  lesser-known facts about the mega-producer | Telugu Movie News - Times of  India
అమెరికా నుంచి డైరెక్ట్ గా ఇండియాలోకి రావడంతో కాస్త ఇక్కడ లాంగ్వేజ్ తో ఇబ్బంది పడ్డారని తెలిపింది. తెలుగు, తమిళ్,మలయాళం వంటి భాషలలో ఇప్పటివరకు 13 సినిమాలు చేశానని తెలియజేసింది. ఇక డేటింగ్ విషయంపై అల్లు అరవింద్ తనని అడిగారని తెలియజేస్తూ.. నేను అల్లు శిరీష్ డేటింగ్ లో ఉన్నామనే గాసిపులు తనకు వినిపించాయి.అయితే ఇవన్నీ నేను చదివినవి కాదు తన తల్లి చదివిందని తెలిపింది.ఈవిషయాలు తెలిసి తన చాలా బాధపడిందని..కానీ నేను ఇలాంటివి పట్టించుకోలేదని..అయితే ఒక విషయం చెప్పాలి.. ఊర్వశివో రాక్షసివో సినిమాకు ముందు అల్లు శిరీష్ ని అసలు కలిసింది లేద. కేవలం పూజా కార్యక్రమాలలో కలవడమే జరిగింది. ఆ తర్వాత సినిమా డిస్కషన్ కోసం ఒక కాఫీ షాప్ లో కూర్చుని క్యారెక్టర్ల గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఈ సినిమాలో శ్రీ, సింధు పాత్ర కోసం చాలా కష్టపడ్డామని తెలిపింది. మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని డేటింగ్ చేసే అంత చనువులేదని. ఇక అల్లు అరవింద్ గారి కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా చేసినప్పటి నుంచి మంచి అనుబంధము ఉంది.. శిరీష్ తో డేటింగ్ విషయం గురించి అరవింద్ గారు కూడా నన్ను అడిగారు.. అది గాసిప్ అని ఇద్దరము నవ్వుకున్నామని తెలిపింది.

Share post:

Latest