అర్జున్ విమర్శలకు క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్..!

తాజాగా అర్జున్ – విశ్వక్ సేన్ మధ్య వ్యవహారం తారస్థాయికి చేరుకుంది. యాక్టర్ గా అందరికీ సుపరిచితుడైన సీనియర్ హీరో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జ తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ కాగా హీరోయిన్గా ఆయన కూతురు ఐశ్వర్య సర్జ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం. కానీ ఈ సినిమాలో మొదట చేసేందుకు అంగీకరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు సడన్ గా షూటింగ్ కి హ్యాండ్ ఇచ్చాడని అర్జున్ ఆరోపించాడు. మొదట కాల్ షీట్స్ మార్చమని చెప్పాడని .. ఆ తర్వాత అడ్జస్ట్ చేసినా కూడా మళ్లీ షూటింగ్ కి రావడం లేదని అర్జున్ ఈరోజు చెప్పుకొచ్చారు. షూటింగ్ ఆరు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. గంట ముందుగా షూటింగ్ క్యాన్సిల్ చేయమని మెసేజ్ చేసాడు. అతను కమిట్మెంట్ లేని యాక్టర్ అంటూ అర్జున్ అతడిపై తీవ్ర విమర్శలు చేశారు.

Vishwak Sen Highly Unprofessional: Arjun

దీనిపై స్పందించిన విశ్వక్ సేన్.. ఈ సినిమా పాటలు, డైలాగ్, మ్యూజిక్ విషయంలో అర్జున్ కి సూచనలు చేసిన మాట వాస్తవమే.. కానీ అవేవీ అర్జున్ పట్టించుకోలేదు . మూవీ విషయంలో తాను చెప్పినట్టే నడుచుకోవాలని అర్జున్ మొండి పట్టుదలతో ఉన్నారు. హీరోగా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఈ సినిమా నుంచి బయటకు వచ్చానని కూడా తెలిపాడు విశ్వక్ సేన్. ఈ సినిమా కోసం అర్జున్ ఇచ్చిన పారితోషకంతో పాటు డాక్యుమెంట్లను కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి పంపించినట్లు విశ్వక్ సేన్ వారితోనే చర్చించబోతున్నట్లు కూడా తెలిపారు.

arjun sarja, Vishwak Sen: అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న విశ్వక్ సేన్..  ఛాంబర్‌లో నిర్మాతల ఫిర్యాదు! - arjun sarja filed complaint on vishwak sen  walked out from his film - Samayam Telugu

ఇదిలా ఉండగా అర్జున్ సర్జా త్వరలోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి విశ్వక్ సేన్ పై ఫిర్యాదు చేయబోతున్నట్లు అలాగే మరో హీరోతో ఈ సినిమా చేస్తానని కూడా అర్జున్ స్పష్టం చేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Share post:

Latest