కమ్మ నేతకే విజయవాడ ఎంపీ సీటు.!

గత ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించిన కొన్ని సీట్లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంటే ఆ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదనే చెప్పాలి. కానీ ఈ సారి ఆ సీట్లని కూడా గెలుచుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గెలవని సీట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో విజయవాడ ఎంపీ సీటుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న ఈ సీటుని ఈ సారి ఎలాగైనా గెలుచుకోవలన్ చూస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వసీపీ ఓడిపోతూ వస్తుంది..వరుసగా కేశినేని నాన్ టీడీపీ నుంచి గెలుస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నాని లేదా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేయవచ్చు. కానీ ఎవరు పోటీ చేసిన ఇక్కడ టీడీపీకే అనుకూల అవకాశాలు ఉన్నాయి. పైగా జనసేనతో పొత్తు కుదిరితే డౌట్ లేకుండా ఈ సీటు టీడీపీ ఎత్తుకుపోతుంది. మళ్ళీ వైసీపీకి నిరాశ తప్పదు.

అయితే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి బలమైన నేతకు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సీటు ఎలాగో కమ్మ వర్గం డామినేషన్ ఉంటుంది..అందుకే అదే వర్గానికి చెందిన నేతకు సీటు ఇవ్వడం ఖాయం. గత రెండు ఎన్నికల్లో కమ్మ నేతలకే సీటు ఇచ్చారు గాని..వారు బిజినెస్ చేసుకునే వారు. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి లేకుండా బలమైన నాయకుడుని దించాలని చూస్తున్నారు.

ఇప్పటికే దాసరి జై రమేష్ పరిశీలనలో ఉంది..కానీ ఈయన వ్యాపారవేత్త. అదే సమయంలో గన్నవరం సీటు దక్కే అవకాశం లేని యార్లగడ్డ వెంకట్రావుని విజయవాడ ఎంపీగా బరిలో దింపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కాకపోతే మర్రి రాజశేఖర్‌ని దింపవచ్చని కొత్తగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన..కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు. ఎలాగో ఈయన సొంత సీటు చిలకలూరిపేట దక్కడం కష్టం. దీంతో ఈయన్ని విజయవాడ ఎంపీగా బరిలో దింపే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. మర్రి కమ్మ వర్గం నేత..పైగా ఈయన వివాదరహితుడు..కాబట్టి కమ్మ వర్గం మద్ధతు ఉంటుందని అనుకుంటున్నారు. మరి చూడాలి చివరికి విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందో.