అందాల తార ‘లయ’ ఇపుడు ఏం చేస్తోందో, ఎలా వుందో తెలిస్తే అవాక్కవుతారు?

నిన్నటి అందాల తార ‘లయ’ గురించి తెలియని తెలుగు వారు వుండరు. ఎందుకంటే బేసిగ్గా లయ మన తెలుగు అమ్మాయి కాబట్టి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు నటీమణులు అరుదు. అందులో హీరోయిన్ లయ మొదటి స్థానంలో ఉంటుంది. లయ వెండితెరపై తనదైన మార్కుతో దూసుకుపోయింది. ముఖ్యంగా ఫామిలీ డ్రామాలు ఆమె చేతికే వెళ్ళేవి. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటించారు. వివాహం తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన లయ చాలా కాలం తర్వాత సోషల్ మీడియా వేదికగానే ప్రేక్షకులను దర్శనం ఇస్తున్నారు.

1992లో విడుదలైన ‘భద్రం కొడుకో’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన లయ, అనతికాలంలోనే లక్కీలేడీగా పేరు తెచ్చుకుంది. ఇంకేముంది, కట్ చేస్తే అమ్మడుకి మంచి మంచి సినిమాలు వచ్చి పడ్డాయి. దాంతో దాదాపు ఓ దశాబ్దకాలంపాటు తెలుగు సినిమాని రూల్ చేసింది. స్వయంవరం సినిమాతో అయితే మొదటి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతోనే హీరో వేణు తొట్టెంపూడి హీరోగా పరిచయమయ్యాడు. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కడం విశేషం.

ఆ తరువాత ప్రేమించు సినిమాతో ఆమె జీవితమే మారిపోయిందని చెప్పుకోవాలి. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఆమె ఉంది కొద్ది రోజులే అయినా 50కి పైగా చిత్రాల్లో నటించారు. 2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తరువాత కాలిఫోర్నియాలోనే ఆమె సెటిలైపోయారు. ఇక చాలా కాలం తర్వాత లయ సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆమె కాలిఫోర్నియాలో జరుగుతున్న ఒక ఎలక్షన్ లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఫోటోలు దర్శనం ఇచ్చాయి. కాగా లయ అప్పటికీ ఇప్పటికీ పెద్ద మారలేదు.

Share post:

Latest