ఇంట్రెస్టింగ్: ఈ రోజు మహేశ్ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డే..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబు ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే తన తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు.. ఏనాడు సినిమా అవకాశాల కోసం నాన్న పబ్లిసిటీని ..పాపులారిటీని వాడుకోలేదు. ఘట్టమనేని కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరే సూపర్ స్టార్ మహేష్ బాబు గా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగారు . సినిమా సినిమాకి తన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తూ టాప్ హీరోగా నిలుచున్నాడు .

అంతేకాదు మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫిజిక్ చూస్తే మెల్ట్ అయిపోతారు . ఎలాంటి కుర్ర బ్యూటీ అయినా సరే మహేష్ బాబు లుక్స్ కి పడిపోవాల్సిందే. ఇప్పటికీ కుర్రబ్యూటీలు ఆయన సరసన సినిమాలో నటించాలని ఆత్రుతగా ఉన్నారు అంటే దానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు మంచితనం ..అయితే సెకండ్ రీజన్ మహేష్ బాబు అందం. కాగా ఈరోజు మహేష్ బాబు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మరీ ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యాన్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది.

మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈరోజే . మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా  “నీడ”  . దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన నీడ అనే ఈ సినిమాల్లో మహేష్ బాబు ఫస్ట్ టైం తెర పై కనిపించాడు . ఈ సినిమాలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 1979లో విడుదలైన ఈ చిత్రంలో మురళీమోహన్ ప్రధాన పాత్రలో నటించగా మహేష్ బాబు ముద్దు ముద్దుగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను ఎప్పటికీ తన లైఫ్ లో మర్చిపోలేను అంటూ మహేష్ బాబు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన సంగతి తెలిసిందే .ఏది ఏమైనా సరే ఇంతటి మంచి నటుడిని ఇండస్ట్రీకి ఇచ్చిన కృష్ణకు మరొకసారి థాంక్స్ చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.