మహానటి సావిత్రి బెడ్ రూంలో ఆ హీరో ఫొటోలు… కారణం ఇదే!

మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అరుదైన నటి అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆమె ఎంత సంపాదించిందో చివరి రోజుల్లో అన్ని డబ్బులు పోగొట్టుకొని చాలా దయనీయ పరిస్థితిలో మరణించిందని చెప్పుకుంటూ వుంటారు. తిండి కూడా దొరకని దారుణమైన స్థితిని అనుభవించిందని చెప్పుకుంటూ వుంటారు. ఈ విషయమై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలు ప్రస్తావించారు.

సావిత్రికి కృష్ణుడు పాత్ర చేయడం ఓ కలగా ఉండేదట. దాంతోనే ఆపాత్రని ఆమె చాలా ఇష్టంగా పోషించేదట. జమున వాళ్ళ నాన్నగారు సావిత్రి గారు చేసే నాట్యం చూసి చాలా మురిసిపోయేవారట. అంతేకాకుండా జమునతో సమానంగా సావిత్రిని కూడా తన సొంత కూతురి మాదిరి చూసుకొనేవారట. సావిత్రి పెద్దగా చదువుకోకపోయినా ఒకసారి డైలాగ్ వింటే క్షణాల్లో బట్టి పట్టేసేదట. ఇక సావిత్రి జీవిత చరిత్రగా తెరకెక్కిన మహానటి సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ సావిత్రి జీవితంలో దాదాపు జరిగినవేనట. ఆమె కళ్ళల్లో మెరుపు చూసి నాగిరెడ్డి చక్రపాణి పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ముందే ఊహించారట.

జెమినీ గణేషన్ మొదట్లో ప్రొడక్షన్ వ్యవహారాలలో మునిగి తేలుతున్నపుడు సావిత్రి మొహంలో ఏదో కల ఉండేది అంటూ ఎప్పుడూ తన సన్నిహితులతో చెబుతుండేవారట. ఇక మల్లెపూలన్నా, వర్షం అన్నా మహానటి సావిత్రి కి చాలా ఇష్టం అట. ఎస్వి రంగారావు గారిని సావిత్రి ముద్దుగా బావ అని పిలిచేదట. సావిత్రి బెడ్రూంలో ఏ వైపు చూసినా కూడా జెమినీ గణేషన్ అలాగే సావిత్రి ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటోలే ఎక్కువగా ఉండేవని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Share post:

Latest