సూపర్ స్టార్ కృష్ణ చూసిన లాస్ట్ సినిమా ఇదే..ఆ సీన్ చూసి ఎంతలా నవ్వుకున్నారంటే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ కళామతల్లి మొదటి తరం బిడ్డలలో ఒకరుగా సినీ ఇండస్ట్రీకు చెరగని ఓ గుర్తింపును తీసుకొచ్చారు . సుమారు 350 సినిమాలకు పైగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ..కెరియర్ లో ప్రతి సినిమాను సూపర్ హిట్గా మల్చుకున్నాడు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా అటు ఇటు వచ్చినా కానీ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు వేశారు జనాలు . అంతేకాదు ఎటువంటి కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయకుండా ..ఎటువంటి వివాదాల్లో తలదురుచుకుండా ..ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అంటే చాలా గ్రేట్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

కాగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు అనారోగ్య కారణంగా కాంటినెంటల్ హాస్పిటల్ ఆయన ంట్రి చెందారు. సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు ,ఫ్రెండ్స్, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలు ..పాత వీడియోలు.. పాత సినిమాలు ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని హీరో ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ గా చూసిన సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ లాస్ట్ గా చూసిన మూవీ ఆయన కొడుకు కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన “సర్కారు వారి పాట”. 12 మే 2022న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ను చూసి సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు. అంతేకాదు ఈ సినిమాలో కీర్తితో ఆయన చేసిన రొమాన్స్ చూసి కృష్ణ పకపకానవ్వకున్నాడట . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు పై కాళ్లు వేసే సీన్ చూసి భీబత్సంగా నవ్వుకున్నారట.

చిన్నప్పుడు మహేష్ కూడా వాళ్ళ అమ్మ గారి పక్కన పడుకున్నప్పుడు ఇలాగే కాళ్లు వేసేవాడని..కాళ్ళు వేయనిదే నిద్రపోయేవాడు కాదని ఆయన గుర్తు చేసుకున్నారట . అంతేకాదు కుటుంబ సభ్యులు అంతా కలిసి సినిమా చూస్తున్న టైం లో మహేష్ గురించి ఈ విషయం చెప్పి సూపర్ స్టార్ చాలా హ్యాపీగా నవ్వుకున్నారట .ఆ మూమెంట్స్ ఇప్పటికీ మర్చిపోలేను అంటూ నమ్రత తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మూడు నెలల వ్యవధి లోనే మహేష్ బాబు తండ్రిని తల్లిని కోల్పోవడం ఆయనకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవబోతున్నాడు మహేష్ . కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానక్ రామ్ గూడలోని వాళ్ళ నివాసంలోనే ఉంచుతున్నారు . బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతిక కాయాన్ని తరలించనున్నారు .ఇక తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయనున్నారు..!!

Share post:

Latest