సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో రోల్స్ మిస్ చేసుకున్న సీనియర్ యాక్ట్రెస్ వీరే!

నిన్న మొన్నటి హీరోయిన్లు.. ఓ స్టేజి వరకు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక స్టేజి తరువాత కొన్ని రకాల పాత్రలకు మాత్రమే పరిమితమై పోతుంటారు. అలాంటివారిలో జయసుధ, సాయప్రద, శ్రీదేవి, రాధిక, కుష్బూ, సుహాసిని, రాశి మొదలగువారు వున్నారు. శ్రీదేవి కాలం చేసినప్పటికీ మిగతా వారు అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. సినిమా దర్శకులు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి అనేక కారణాలు చేత ఆ హీరోయిన్లు కొన్ని కొన్ని సినిమాలను చేయలేకపోయారు. అయితే వారు చేసిన సినిమాలకంటే చేయని సినిమాలే ఎక్కువశాతం హిట్ అవుతూ ఉంటాయి.

సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి గురించి తెలుసుకదా. ఈమెని రంగస్థలం లో రంగమ్మత్త పాత్రకి ముందుగా అడిగారట. కారణం తెలియదు కానీ ఆమె చేయలేదు. అందుకే అనసూయతో ఆ పాత్రను చేయించారు. ఆ సినిమాలో ఆ పాత్రకు ఇంతమంచి పేరు వచ్చిందో తెలిసినదే కదా. అలాగే బాహుబలి లో శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో రమ్యకృష్ణ ఆ పాత్రలో నటించి ఇరగదీసారు. అలాగే నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రకు కూడా శ్రీదేవిని సంప్రదిస్తే అందుకు ఆమె నొ చెప్పింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మొదట బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ని సీత పాత్రకు అడిగారట. ఈమె నొ చెప్పడంతో ఆ పాత్ర మన అంజలికి దక్కింది. ఇక శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లి పాత్రకు సంతోషం హీరోయిన్ అయిన గ్రేసీ సింగ్ ను సంప్రదించారు. కానీ ఈమె నొ చెప్పడంతో సుకన్యని తీసుకున్నారు. అలాగే నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు మొదట మీనా ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా అది రమ్యకృష్ట కి దక్కింది. కాగా సదరు సినిమాలు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అయ్యాయి.

Share post:

Latest