ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?

ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన సెలబ్రిటీలు కావడం గమనార్హం.

అవును, KGF సినిమాతో తన రేంజ్ ను మార్చుకున్న యశ్ ఒకప్పటి ఈటీవీ కన్నడలో పలు సీరియళ్లలో నటించి గుర్తింపును తెచ్చుకున్నవాడే. “నంద గోకుల” అనే సీరియల్ తో మంచి పేరును సొంతం చేసుకున్న యశ్ ఆ తరువాత కాలంలో వెండితెరపై మేజిక్ చేసాడు. అలాగే తమిళ సూపర్ స్టార్ నయనతార మలయాళ ఛానల్ లో ప్రజెంటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి నేడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. హీరోయిన్ సాయిపల్లవి కూడా ఢీ షో ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిందనే సంగతి తెలిసిందే. ఈ షోలో డ్యాన్స్ వల్లే సాయిపల్లవికి సినిమాలలో వరుస ఆఫర్లు వచ్చాయి.

ఇక మహానటి కీర్తి సురేష్ బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ అయింది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కెరీర్ ను బలంగా నిర్మించుకుంది. మరో ప్రముఖ నటి నజ్రియా కూడా బుల్లితెర ద్వారానే కెరీర్ ను స్టార్ట్ చేసింది. అలాగే ప్రస్తుతం నటిగా, నిర్మాతగా నజ్రియా మలయాళ సినిమా పరిశ్రమలో మంచి బిజీగా వున్నారు. ఈమధ్యకాలంలో ‘సీతారామం’ సినిమాతో నటి మృణాల్ ఠాకూర్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి విదితమే. కాగా మృణాల్ ‘కుంకుమ భాగ్య’ అనే బాలీవుడ్ సీరియల్ తో కెరీర్ ను స్టార్ట్ చేసింది.

Share post:

Latest