బాలీవుడ్ నుండి 2 బడా ఆఫర్లు కొట్టేసిన రౌడీ హీరో.. డైరెక్టర్స్ ఎవరో తెలిస్తే షాక్..!

టాలీవుడ్ యువ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చే విధంగా ఈ సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరో గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లైగ‌ర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయ్ కెరియర్ లోనే అట్టర్ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ఆడియన్స్ లో ముఖ్యంగా యువతలో మరింత క్రేజ్ తో దూసుకుపోతున్నాడు విజయ్. తాజా సమాచారం ఏమిటంటే టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస‌ సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్లో ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నన విజయ్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కరణ్ జోహార్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మరో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఖుషి సినిమా పూర్తయిన వెంటనే ఈ రెండు సినిమాలు స్టేట్స్ మీదకు వెళ్ళనున్నాయట. ఇక త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికార ప్రకటన వస్తుందని తెలుస్తుంది

Share post:

Latest