ఆ సమయంలో కృష్ణ పై రాళ్లదాడి జరగడానికి కారణం..?

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా కృష్ణ ఎవరితో కూడా విభేదాలు ఉండేవి కావని ఎంతోమంది సిని ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిర్మాతల హీరోగా కూడా పేరు సంపాదించారు. అయితే అలాంటి కృష్ణ మీది ఒకానొక సందర్భంలో కొంతమంది రాళ్లు విసరడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు..  సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు.. | Super star krishna and vijaya  nirmala movie mosagallaku mosagadu ...

ఎన్టీఆర్ పైన ఎదురు తిరిగిన ఒకే ఒక్క స్టార్ హీరో కృష్ణ అప్పట్లో టిడిపి ప్రభుత్వం పై ఒక సెటైర్ వేస్తూ పద్మాలయ స్టూడియోలో ఒక సినిమాను తీశారట కృష్ణ. ఆ సమయంలో టిడిపి శ్రేణులు కృష్ణ మీద పగ పెంచుకున్నారు.1985 లో మోసగాళ్లకు మోసగాడు సినిమా షూటింగ్ కోసం నంద్యాలకు వెళ్లడం జరిగిందట కృష్ణ అలా ఒక రైల్వే ఫారెస్ట్ బ్రిడ్జి మీద ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఇక అదే సమయంలో కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కృష్ణ.

50 వసంతాల 'మోసగాళ్లకు మోసగాడు' – Cinematimesఅలా రాత్రి 10 గంటలకు పైగా ఎన్నికలు ముగించుకొని కర్నూలు చేరుకుంటున్న సమయంలో కొంతమంది టీడీపీ శ్రేణులు కృష్ణ పైన రాళ్ల దాడి చేయడం జరిగినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో కృష్ణ కంటికి తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది. దగ్గరలో ఉండే అక్కడే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో కంటికి కుట్లు వేయించుకొని మరి తర్వాత జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు కృష్ణ. అయితే ఆ సమయంలో కూడా అభిమానులు కృష్ణను చూసేందుకు భారీ సంకలోని వచ్చినట్లు సమాచారం. కృష్ణ హీరో గానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా చేసిన ప్రయోగాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.