అందాలు ఆరబోసే ఈ హీరోయిన్లకు భయంకరమైన వ్యాధులున్నాయి తెలుసా?

సినిమా హీరోయిన్స్ అనగానే బేసిగ్గా అందరికీ, అందమైన అమ్మాయిలు రంగురంగుల ప్రపంచంలో ఎంతో సుఖంగా ఉంటారని అభిప్రాయ పడుతూ వుంటారు. కానీ అది ఊహల వరకే పరిమితం. ఆ రంగురంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. తెరపైన వారు ఆనందంగా కనిపించినా నిజజీవితంలో వారు అంత అందమైన జీవితాన్ని అనుభవించరు. కోట్లు సంపాదిస్తున్నా కోరుకున్నట్లు బ్రతక లేని జీవితాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తీరిక లేని షెడ్యూల్స్ తో వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.

ఈ క్రమంలో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతారు. ముఖ్యంగా మనకి అందమైన స్టార్స్ గా బయటకి కనబడేవారు పలు కారణాలతో దీర్ఘకాలిక మానసిక, శారీరక వ్యాధులకు లోనయ్యారు. ప్రస్తుతం అలాంటివారిలో హీరోయిన్ సమంత గురించి మొదటగా చెప్పుకోవచ్చు. ఈమె జీవితం ఓ అద్దం లాంటిది, అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె అరుదైన ‘మయోసైటిస్’ బారిన పడ్డారు. సమంతకు ఈ వ్యాధి సోకడానికి మితిమీరిన వ్యాయామమే అని ప్రచారం జరుగుతున్నప్పటికీ అసలు కారణం అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటున్నారు.

ఇకపోతే ఇటాలియన్ గుర్రంగా పేరు పొందిన ఇలియానా బాడీ డిస్మార్ఫిక్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వాళ్లు అందం, శరీరం గురించి ఆత్మన్యూనతా భావానికి చాలా తీవ్రంగా గురవుతారు. అలాగే లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార చాలా కాలం స్కిన్ అలర్జీ సమస్యతో బాధపడ్డారు. ఇక బాలీవుడ్ అందాల తారగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా చాలా కాలంగా మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇక స్నేహ ఉల్లాల్ గుర్తుండే ఉంటుంది. ఆమె ప్రాణాంతక ఇమ్మ్యూనో డిజాస్టర్ బారినపడ్డారు. రోజుల తరబడి స్నేహ ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు.

Share post:

Latest