ట్రోల్స్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు వీళ్లే!

సోషల్ మీడియా నేడు బాగా విస్తరించడంతో ఎవరికి తోచిన చర్యలు వారు చేసేస్తున్నారు. ఒక విషయం నచ్చినా, నచ్చకపోయినా బాహాటంగానే చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళమీద మనవాళ్ళు యెప్పుడూ ఓ కన్నేసి ఉంటారేమో మరి. వారినే ముఖ్యంగా వీరు ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ట్రోల్స్ అనేవి పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న ఫేక్ ప్రచారాల వల్ల సెలబ్రిటీలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు అని చెప్పుకోవాలి.

అయితే ఈ తరహా యూట్యూబ్ ఛానెళ్లపైన సదరు సెలబ్రిటీలు డైరెక్ట్ గానే అసహనాన్ని తెలియజేసిన సందర్భాలు అనేకం వున్నాయి. మరీ ముఖ్యంగా సినీ తారల పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా అవి ఉంటున్నాయి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ గురించి అందరికీ తెల్సిందే. గత కొన్నేళ్లుగా ఆమె తెలుగులో చేసిన పాత్రల గురించి తెలిసిందే. నటిగా ఆమె పట్ల ఓ సాఫ్ట్ కార్నర్ వుంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల పనితీరు వలన ఆమె చాలా అశాంతికి గురవుతోందని భోగట్టా.

అలాగే చైతన్యతో విడాకుల సమంతని ఎంతగా ట్రోల్స్ చేసారో తెలిసినదే. ఇక మంచు ఫామిలీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మంచు లక్ష్మి, విష్ణు, మోహన్ బాబు.. ఇలా ఆ ఫ్యామిలీలో ఎవరినీ వదలడం లేదు. వారు తుమ్మినా, దగ్గినా ట్రోల్స్ చేస్తున్నారని వాపోతున్నారు. అలాగే జీవిత కూతుళ్ల గురించి కూడా గతంలో ట్రోల్స్ చేసిన సంగతి విదితమే. ఇలా యూట్యూబ్ ఛానెల్స్ ట్రోల్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. తారల వ్యక్తిగత జీవితాల్లోకి యూట్యూబ్ ఛానల్స్ తొంగిచూడటం చాలా దారుణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest