ఆ కారణంగానే పవన్ సినిమాలలో నన్ను తీసుకోలేదు.. ఆలీ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా ఫ్రెండ్షిప్ నటీనటుల మధ్య ఉండనే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది హీరోలు తమ సినిమాలలో కొంతమంది కమెడియన్లను ఏరుకోరి మరి ఎంచుకుంటూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. అప్పట్లో చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా బ్రహ్మానందం కనిపించేవారు. ఒకవేళ కథలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉండేలా చూసేవారట.

Is it a crime to join YSRCP?: Actor Ali slams Pawan Kalyan for alleging he  deserted him | The News Minute

అలా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కమెడియన్ ఆలీని కూడా అలాగే తీసుకుంటూ ఉండేవారట. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. అందుచేతనే ఆలీ లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా కూడా చేసేవారు కాదట. ఇక ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం ఎలాంటిదో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో ఆలీ లేకుండా అసలు సినిమాలే చేయనని డైరెక్టుగా చెప్పేవారట. అయితే ఇంత గొప్ప స్నేహితులు అయినప్పటికీ కూడా వీరిద్దరిని రాజకీయం అనే అంశం వేరు చేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Pawan Kalyan sensational comments on Ali
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెడితే ఆలీ మాత్రం వైసీపీలో చేరారు. దీంతో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆప్పటినుంచి వీరిద్దరు పెద్దగా బయట ఎక్కడ కనిపించలేదు.పవన్ కళ్యాణ్ రీయంట్రీ ఇస్తూ చేసిన రెండు సినిమాలలో కూడా ఆలీ లేకపోవడంతో వీరిద్దరి మధ్య వైర్యం మరింత పెరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆలీ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నేను ఇప్పటివరకు మంచి స్నేహితులమే అయితే చాలామంది నన్ను ఒక ప్రశ్న అడిగారు భీమ్లా నాయక్,వకీల్ సాబ్ సినిమాల్లో ఎందుకు నటించలేదని.. అయితే మీరు గమనించినట్లయితే ఆ సినిమాలలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు ఎక్కడ కామెడీకి పెద్దగా స్కోప్ లేదు. కామెడీ పరమైన సన్నివేశాలు ఉంటే కచ్చితంగా ఆ సినిమాలలో తనను తీసుకుంటారని తెలియజేశారు. అందుచేతనే ఆ సినిమాలలో తనని తీసుకోలేదని తెలిపారు ఆలీ.

Share post:

Latest