యరపతినేని వర్సెస్ కాసు..గురజాల రగడ..!

గురజాల నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది..పల్నాడు ప్రాంతానికి ఆయువు పట్టుగా ఉన్న గురజాలలో రాజకీయ యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా, తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది.

ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు..ఇప్పటికే పలుమార్లు వీరి మధ్య సవాళ్ళ పర్వం నడిచింది…తాజాగా కూడా యరపతినేని..తమ హయాంలో 1500 కోట్లతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు అభివృద్ధి లేదని, అరాచకమే సాగుతుందని ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కాసు..అప్పుడు 1500 కోట్లతో ఏం అభివృద్ధి చేశారో..ఇప్పుడు తాను 3 వేల కోట్లతో ఏం అభివృద్ధి చేశానో చర్చకు సిద్ధమని, దమ్ముంటే రావాలని యరపతినేనికి కాసు సవాల్ విసిరారు.

ఇక కాసు సవాల్‌కు టి‌డి‌పి నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి..అభివృద్ధి అంటే వైసీపీ వాళ్ళ అభివృద్ధి కాదని, ప్రజలకు అభివృద్ధి జరగాలని, తాము ఏ సవాల్‌కైనా సిద్ధమని అంటున్నారు. యరపతినేని దీనిపై గట్టి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగానే కాసు, యరపతినేనిల మధ్య పోరు మరింత ముదిరింది. ఈ పోరు కాస్త చాలా దూరం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం గురజాలలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది గాని..ఇప్పుడు టి‌డి‌పి కూడా పుంజుకుంది..అటు వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కాసుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పావులు కదుపుతున్నారు. ఈ అంశం వైసీపీకి మైనస్ గా ఉన్నాయి. ఇక ఇక్కడ జనసేనకు ఓ 10 వేల ఓటు బ్యాంక్ ఉంది. అది యారాపతినేనికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి గురజాల రగడ రసవత్తరంగా సాగుతుంది.

Share post:

Latest