ఆ విషయంలో టాలీవుడ్ నిల్.. బాలీవుడ్ ది బెస్ట్..తాప్సీ కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ , బాలీవుడ్ అంటూ సరికొత్త చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ని ఎక్కువగా ఫోకస్ చేసి చూసే వాళ్ళు. సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఏ నెంబర్ వన్ అని ..యాక్టింగ్ లో బాలీవుడ్ ను ఢీకొట్టే నటీనటులు ఎవరూ లేరని చెప్పుకొచ్చేవారు . బాలీవుడ్ అంటే అదొక దైవంలా భావించే వాళ్ళు సినీవర్గాలు . అయితే రాను రాను పరిస్థితులు మారిపోయాయి . మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ అయిపోయింది . ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే నానా తంటాలు పడుతూ ఉంది .

కాగా ప్రజెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పుజుకొని నంబర్ వన్ పొజిషన్లో ఉంది . బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకెళ్లాడు ఎస్ఎస్ రాజమౌళి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ కూడా టాలీవుడ్ నటులతో కలిసి సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు . మరికొందరు ఏమీ చేయలేక బాలీవుడ్ నటులు టాలీవుడ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆలిస్టులోకి యాడ్ అయిపోయింది తాప్సి. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాప్సి కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు ఫిలిమ్స్ తోనే. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనే నటనను ఎలా నటించాలో తెలుసుకొని.. తెలుగులో సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది . తెలుగులో వచ్చిన పాపులారిటీతోనే బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ..ప్రజెంట్ తనకు అన్నం పెట్టిన టాలీవుడ్ నే వేలెత్తి చూపిస్తుంది. ఎస్ రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో తాప్సీ టాలీవుడ్ పై పరోక్షకంగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

ఆమె మాట్లాడుతూ ..”నేను ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాను . ప్రతి సినిమాలో క్యారెక్టర్ క్యారెక్టర్ కు వేరియేషన్స్ చూపించాను. నేను దేని గురించి అయినా సరే మాట్లాడే ముందు మంచి చెడు చూస్తా ..ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా ..ముఖం మీద నే చెప్పేస్తాను ..నేను ఇలా మాట్లాడటం కొందరికి నచ్చదు ..అర్థం చేసుకోకుండా నా పొగరు అని కామెంట్ చేస్తారు ..అయినా నేను లెక్క చేయను ..ఎవరికోసమో నా అభిప్రాయాలను మార్చుకోలేను .. నాకు నచ్చినట్లే ఉంటా. టాలీవుడ్ తో కంపేర్ చేస్తే బాలీవుడ్ కి వచ్చాక మంచి మంచి సినిమాలు ఎలా చూస్ చేసుకోవాలన్నది నేర్చుకున్నాను . అదే ఫాలో అవుతున్నాను ..భవిష్యత్తులోనూ అదే ఫాలో అవుతాను “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే తాప్సి మాటలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . టాలీవుడ్లో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ పై మండిపడుతున్నావా నువ్వు ..టాలీవుడ్ లో ఇక సినిమాలు చేయలేవు ..నీ సినిమాలను టాలీవుడ్ లో బ్యాన్ చేయాలి అంటూ మండిపడుతున్నారు.

Share post:

Latest