హీరోలపై మరొకసారి విరుచుకుపడ్డ తమ్మారెడ్డి.. కారణం..!!

గడిచిన గత కొద్దిరోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నటుడు అర్జున్ మరొక నటుడు విశ్వక్ సేన్ మధ్య పెద్ద ఎత్తున పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని చేయబోతున్నట్లు గడిచిన కొన్ని నెలల క్రితం ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలకు కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తదితరులు హాజరవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయానికి విశ్వక్ సేన్ ఈ సినిమా షూటింగ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా విశ్వక్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో కొంతమంది నెటిజన్లు , అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఇలా రెండు రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ విషయం గురించి పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో ఈ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు సైతం స్పందించడం జరిగింది. ఈ క్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఈ విషయంపై స్పందించారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు విశ్వక్ ఈ విధంగా వ్యవహరించడం దర్శక నిర్మాతను పూర్తిగా అవమానించినట్లేనని తెలియజేశారు. సినిమా కథ మొత్తం విన్న తర్వాత తీరా షూటింగ్ కు ముందు ఈ సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పడం ఏ మాత్రం మంచిది కాదని సినిమా కథ నచ్చకపోతే ఈ విషయాన్ని ముందుగానే చెప్పాలని కోప్పడడం జరిగింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలకు కాస్త ఆటిట్యూడ్ ఎక్కువైందని ఈ కారణంగానే సినిమాలలో ఫ్లాప్ అవుతున్నారని తెలిపారు తమ్మారెడ్డి. హీరోలు కథ విషయంలో జోక్యం చేసుకోకపోవడం ఎంతో మంచిది అంటూ తెలిపారు.

Share post:

Latest