అస్వస్థకు గురైన సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని సమాచారం. దీంతో సూపర్ స్టార్ కృష్ణ ను హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స జరుగుతోంది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన అభిమానులు తీవ్రంగా కలవరం చెందుతున్నారు.

Mahesh Babu Father Super Star Krishna Joins in Hospital | హాస్పిటల్లో సూపర్  స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు News in Teluguఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈస్ట్ వన్ కలర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే దక్కింది . అలాగే జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ చిత్రాలను సైతం తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇలా ఎన్నో అద్భుతాలను సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణకు నేటికీ అభిమానుల సంఖ్య భారీగానే ఉందని చెప్పాలి. అయితే తాజాగా ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురి అవుతున్నారు. మరి ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మరి కొన్ని గంటలు ఆగితే తప్ప తెలియదనే చెప్పాలి.

Share post:

Latest