సూప‌ర్ స్టార్ కృష్ణ పేరిట ఎన్ని వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ(79) ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. అక్క‌డ ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో కృష్ణ హాస్పిటల్ లో చేరినప్పటికీ ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.

కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఆయ‌న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక కృష్ణ మరణం సందర్భంగా ఆయన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆస్తి వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమంలో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోగా సత్తా చాటి ఎన్నో రివార్డులు అవార్డులు అందుకున్న కృష్ణ.. ఆస్తులను కూడా బాగానే వెనకేసుకున్నారు. ఆయన పేరిట దాదాపు రూ. 300 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. స్వంత గ్రామం బుర్రిపాలెంతో స‌హా హైదరాబాద్, చెన్నై నగరాల్లో కృష్ణ పేరిట ఇళ్ళు, ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అలాగే ఆయ‌న గ్యారేజ్ లో మొత్తం రూ. 20 కోట్లు విలువ చేసే 7 కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest