సుమతో పెళ్లి జీవితంపై రాజీవ్ కనకాల సెన్సేషనల్ కామెంట్స్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి సుమ కనకాల. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో శరవేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా, తెలుగులో నంబర్ 1 యాంకర్‌గా స్థానం సంపాదించుకుంది. టీవీ ఆన్ చేయగానే ఒక్క ఛానెల్‌తో సంబంధం లేకుండా అన్ని ఛానెల్స్‌లోని ప్రోగ్రామ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఇలా అన్ని చోట్ల సుమనే కనిపిస్తుంది. మొదట సుమ సీరియల్స్ లో నటించి యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మలయాళ కుట్టి అయిన సుమను టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ గతంలో రాజీవ్, సుమల మధ్య విబేధాలు వచ్చి ఇద్దరు విడిపోయి వేరుగా వుంటున్నారని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఈ విషయం గురించి తాజాగా రాజీవ్ కనకాల స్పందించాడు. తాము వేరుగా ఉంటున్నామని వస్తున్న వార్తలన్నీ వట్టి అబద్ధం అని కుండ బద్దలు కొట్టాడు. “నేను మా నాన్నగారి ఫ్లాట్‌లో వున్నాను, దానిని కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను నా భార్యని చూసి ఎపుడు గర్వపడుతూ ఉంటాను.” అని స్పందించాడు రాజీవ్ కనకాల.

సుమ కనకాల టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నా తన కుటుంబం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తుంది. ప్రస్తుత సుమ, రాజీవ్‌ల కుమారుడు సినిమాలో నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్బంగా ఇంట్లోనే స్పెషల్‌గా కేక్ కట్ చేపించింది సుమ. అంతే కాకుండా గోదావరి తీరంలో కూడా వారిద్దరూ కలిసి సందడి చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో రాజీవ్, సుమ ఇద్దరు టైటానిక్ లవర్స్ తరహాలో ఇచ్చిన స్టిల్ హైలెట్ అయింది. ఈ వీడియో చూశాక వారిద్దరూ అంతా అన్యోన్యం గా వుంటారో అర్ధం అవుతుంది. ఇంత అన్యోన్యంగా ఉన్న జంట గురించి విడోపోయారనే అబద్ధపు వార్తలు రాయడం అనేది బాధాకరం.

Share post:

Latest